అమ్మ నవ్వు చూస్తే అన్నీ మర్చిపోతాం – మెగాస్టార్‌ చిరంజీవి

-

అమ్మ నవ్వు చూస్తే అన్నీ మర్చిపోతామని మెగాస్టార్‌ చిరంజీవి పేర్కొన్నారు. ఇవాళ మదర్స్‌ డే. ఈ నేపథ్యంలోనే… సినీ తారలు, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు.. మదర్స్‌ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. వారి వారి తల్లులపై తమ ప్రేమను చూపిస్తున్నారు.

ఈ తరుణంలోనే మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. మాతృదినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి అంజనమ్మ, ఇద్దరు చెల్లెళ్లతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. “అనురాగం, మమకారం… ఈ రెండింటి అర్థమే అమ్మ. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం’ అని పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news