సల్మాన్ ఖాన్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన చిరు..!!

-

టాలీవుడ్ మెగాస్టార్ హీరో చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆరుపదుల వయసులో కూడా ఆయన అంత స్పీడుతో సినిమాలు చేస్తుండడంపై ప్రతి ఒక్కరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా చిరంజీవి అడిగితే కాదనకుండా ఆయన సినిమాలలో అతిథి పాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదు సల్మాన్ ఖాన్. నిజానికి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ఒక్కో సినిమాలో నటించేటప్పుడు ఒక రోజుకు 12 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటారు. ఇక దీనిని బట్టి చూస్తే ఆయన రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక గాడ్ ఫాదర్ సినిమాలో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. కాబట్టి ఆయనను ఇబ్బంది పెట్టకుండా కనీసం 20 కోట్ల రూపాయలైనా ఇవ్వాలని నిర్మాతలు అనుకున్నారు.. అందులో భాగంగానే సినిమా ఆఫర్ చెప్పి 20 కోట్ల రూపాయలు చెప్పినప్పుడు సల్మాన్ మనస్థాపం చెందాడట. ఇక ఒకవేళ ఆ డబ్బులు ఇస్తే వాటిని తిరిగి వెనక్కి ఇస్తానంటూ బెదిరించాలని సమాచారం. అంతేకాదు గాడ్ ఫాదర్ సినిమాలో అతిథి పాత్ర కోసం పారితోషకం ఇవ్వాలని నిర్మాతలు పట్టుబట్టినట్లయితే అతిథి పాత్రలో నటించనని కూడా చెప్పాడట.. అంతేకాదు చిరంజీవి ఉద్దేశించి సల్మాన్ మాట్లాడుతూ.. నా సినిమాలో ఒక పాత్ర చేయమని నేను మిమ్మల్ని అడిగితే దానికి మీరు వసూలు చేస్తారా? అని అడిగాడట. ఇక ఆ ప్రశ్నకు చలించిపోయిన చిరు సైతం సైలెంట్ అయినట్లు సమాచారం.ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట చిరంజీవి.. ఏదైనా కాస్ట్లీ గిఫ్ట్ సల్మాన్ ఖాన్ కు బహుమతిగా ఇవ్వడానికి చిరంజీవి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆ బహుమతి ఇవ్వలేకపోతే కనీసం ఒక మంచి ఇల్లు ఆయనకు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news