ఏపీలోని మొక్కజొన్న ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఇద్దరు మృతి!

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. బందపురం సమీపంలోని ఓ పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. పరమేశు మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేస్తుండగా.. ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అస్వస్థతకు గురైన ముగ్గురిని కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్
పరమేశు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్

అయితే చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను ఒడిశాకు చెందిన డమా బీరువా (23 ఏళ్లు), తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన గాజుల శ్రీను (26 ఏళ్లు)గా గుర్తించారు. అయితే పరిశ్రమలో సరైన జాగ్రత్త చర్యలు చేపట్టకుండా కార్మికులు బాయిలర్ క్లీనింగ్ చేశారని, ఈ క్రమంలో ఆక్సిజన్ అందక కార్మికులు అస్వస్థతకు గురయ్యారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.