RRR మూవీ టీంకు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు

-

RRR సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ వేడుకల్లో వేస్ట్ ఒరిజినల్ సాంగ్ గ RRR సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. తెలుగు సినీ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఈ ఘనత సాధించిన మొదటి సినిమాగా RRR చిత్రం నిలిచిపోయింది.

నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. ఎంతో ఉత్కంఠగా వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకుల చిరకాల కల నెరవేరింది. ఈ నేపథ్యంలోనే, RRR మూవీ టీంకు ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. సంగీత ప్రియులను తట్టిలేపిన ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గౌరవనీయమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు మరియు ఆయన బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news