ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి క్రేజీ టైటిల్.. ఫ్యాక్షన్ నేపథ్యంలో..

అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్, తన తర్వాతి సినిమాని ఎన్టీఆర్ తో అని ప్రకటించాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ వచ్చేస్తాడు. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులు పూర్తిచేసాడని టాక్. సినిమా టైటిల్ ఇదేనంటూ పుకార్లు కూడా బయటకి వచ్చాయి. రాజకీయాఅల నేపథ్యంలో కథ సాగుతుందని “అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ ఫిక్స్ చేసారని చెప్పారు.

తాజా సమాచారం ప్రకారం మరో కొత్త టైటిల్ తెర మీదకి వచ్చింది. చౌడప్ప నాయుడు అనే పేరుతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఈ మేరకు చిత్రబృందం ఈ పేరును పరిశీలిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలి వస్తున్నాయి. పేరు చూస్తుంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమా అని అనిపిస్తుంది. మరి నిజంగా ఈ టైటిల్ అయినా ఫిక్స్ అయినట్టేనా, లేదా అన్నది చిత్రబృందం స్పందిస్తేనే గానీ తెలీదు.