అందరి చూపు అతని మీదే..!

-

ఆంజనేయులు సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకుని లేటెస్ట్ గా గీతా గోవిందం తో హిట్ అందుకున్న పరశురాం ప్రస్తుతం ఉన్న క్రేజీ డైరక్టర్స్ తో ఒకరిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కెరియర్ లో చేసిన ప్రతి సినిమా అర్ధవంతంగా చేయడం ఆయన అలవాటు. ఆ క్రమంలోనే సోలో, యువత, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు వచ్చాయి. సినిమా సినిమాకు లేట్ చేస్తున్నా అతని సినిమా అంటే మాత్రం కన్ఫాం హిట్ అనేయొచ్చు.

లేటేస్ట్ గా గీతా గోవిందంతో మరోసారి తన సత్తా చాటిన దర్శకుడు పరశురాం తో సినిమా అంటే నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో ఆస్థాన దర్శకుడిగా మారిన పరశురాం తన తర్వాత సినిమాను కూడా గీతా ఆర్ట్స్ లో చేస్తారని ఊహించారు కాని సడెన్ గా మంచు విష్ణుతో పరశురాం సినిమా లైన్ లోకి వచ్చింది.

ఇంతకుముందు ఉన్న కమిట్మెంట్ లో భాగంగా పరశురాం విష్ణుతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మోహన్ బాబు నిర్మాతగా ఈ సినిమా ఉంటుందట. ఇక ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో కూడా పరశురాం సినిమా చేస్తాడని తెలుస్తుంది. చూస్తుంటే పరశురాం కూడా స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news