Adipurush : సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదు !

-

తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఆది పురుష్ డైరెక్టర్ ఓంరౌత్, హీరోయిన్ కృతి సనన్ ను కౌగిలించుకొని ముద్దు పెట్టడంపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సి ఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తాం. అటువంటి ప్రదేశంలో ఇలాంటి పనులు ఏంటి. ఆ పనులు సీతారాములను అవమానించడమే సీత పాత్రకు కృతి సూట్ కాలేదు’ అని తెలిపారు. ‘తిరుమల కొండపైన ఇలాంటి వికారమైన చేష్టలు చేయకూడదు. అక్కడ కొన్ని నియమాలు పాటించాలి. బహిరంగంగా కౌగిలింత, ముద్దు పెట్టుకోవడం చాలా దారుణమైన కార్యక్రమం’ అని మండిపడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news