మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి

-

ఇటీవల పలు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు సామాన్యుల ప్రాణాల మీదకు వస్తున్నాయి. కొంత మంది ఆ సభలకు వెళ్తూ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణఆలు కోల్పోతుంటే.. మరికొందరేమో ఆ సభా ప్రాంగణాల వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరైన చెరువుల పండుగ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగగా…. అక్కడున్న వారి అప్రమత్తతో ప్రమాదం తప్పింది.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భీంగల్ మండలం పురానీపేట గ్రామంలో చెరువుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చెరువు వద్ద వేడుకల కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి హాజరుకాగా ఆయన అభిమానులు టపాకాయలు పేల్చారు. ఈ క్రమంలోనే మంటలు చెలరేగి పెద్దఎత్తున వ్యాపించాయి. వంటలు, భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్న చోట మంటలు అంటుకుని టెంటు దగ్ధమైంది. అక్కడున్న వారంతా పరుగులు తీయటంతో ప్రమాదం తప్పింది. అనంతరం, తేరుకుని నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news