ఇండిగో విమానాయ సంస్థపై రానా ఆగ్రహం..అత్యంత చెత్తదంటూ ట్వీట్‌

-

ఇండిగో విమానాయ సంస్థపై దగ్గుబాటి రానా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రానా ట్వీట్ చేశారు. ఇండిగో ఏయిర్ లైన్స్ వల్ల అత్యంత చెత్త అనుభవం ఎదురైందని.. ఇండిగో విమాన వేళలు సరిగా లేవని మండిపడ్డారు. మిస్సైన లగేజి ట్రాకింగ్ సరిగా లేదని.. సిబ్బందికి కూడా సరైన సమాచారం ఉండదన్నారు.

హైదరాబాద్ నుంచి కుటుంబంతో బెంగళూరు వెళ్లిన రానా… శంషాబాద్ విమానాశ్రయంలో చెక్ ఇన్ అయ్యాక ఫ్లైట్ ఆలస్యమంటూ సిబ్బంది సమాచారం ఇచ్చారు.
దీంతో మరో విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు రానా, కుటుంబసభ్యులు. అయితే, లగేజ్ ఇంకో విమానంలో వస్తుందంటూ సిబ్బంది సమాచారం ఇచ్చారు. బెంగళూరు చేరుకున్నాక లగేజి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రానా.

ఇండిగో ఇంజనీర్లు బహుశా మంచి సిబ్బందే కావచ్చు, కానీ వారికి సరైన సూచనలు చేయడం అవసరమని.. శీతాకాల ప్రయాణానికి సంబంధించి ఇండిగో పోస్టర్ ను రీట్విట్ చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు రానా. షెడ్యూల్ చేసిన విమానాలు ల్యాండ్ కాకపోవచ్చు లేదా టేకాఫ్ కాకపోవచ్చని.. ప్రయాణికుల లగేజ్ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఉండదని పేర్కొన్నారు రానా.

Read more RELATED
Recommended to you

Latest news