బాలీవుడ్ హాట్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకునేలు కొన్నాళ్లుగా ప్రేమలో మునిగితేలిపోతున్నారని అందరికి తెలిసిందే. ఎక్కడ చూసినా సరే ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతారు. మొదట్లో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనడిగినా సరే ఎబ్బే అలాంటిదేమి లేదని చెప్పిన వీళ్లు ఇప్పుడు ఏకంగా పెళ్లి కార్డ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. రణ్ వీర్, దీపికలు నవంబర్ 15 న పెళ్లి చేసుకోబోతున్నారట.
ఏకంగా వారు వెడ్డింగ్ కార్డ్ తోనే ఈ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. మా పెళ్లికి పెద్దల అంగీకారం దొరికింది. ఇన్నాళ్లు తమ వెంట ఉన్నవారందరికి థ్యాంక్స్ అంటూ పెళ్లి ఎనౌన్స్ మెంట్ కార్డ్ ను ట్విట్టర్ లో పెట్టారు. సో మరో సిని ప్రేమజంట ఒక్కటి కాబోతుంది. తెలుగులో నాగ చైతన్య, సమంతలు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారితో పాటుగా రణ్ వీర్, దీపికలు సూపర్ కపుల్స్ అవనున్నారు. 5 ఏళ్ల క్రితం రాం లీలా సినిమా నవంబర్ 15న రిలీజైంది. అందుకే ఆ సినిమా రిలీజ్ నాడే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు ఈ ప్రేమజంట.