దేవదాస్ యు/ఏ..!

-

నాగార్జున, నాని కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ దేవదాస్ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేసిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. మొదటిసారి నాగార్జున, నాని కలిసి చేసిన కామెడీ ట్రైలర్ లోనే జోష్ తెప్పించగా సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని అంటున్నారు. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్ గా నటించిన దేవదాస్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. దాదాపు 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో గురువారం రాబోతున్న దేవదాస్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version