దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్ కి రెడీ.. కానీ!

-

ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి పాజిటివ్ రెస్పాన్సే బయటకి వచ్చింది. మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఆనంద్ నటన, మధ్యతరగతి యువకుడి జీవితాన్ని దర్శకుడు చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

Actor Navdeep, Co Founder C Space Along With Rakesh Rudravanka – CEO – C Space

ఈ ప్రమోషన్లలో ఆనంద్ దేవరకొండ ఆసక్తికర విషయాలు వెల్లడి చేసాడు. అన్న విజయ్ దేవరకొండతో కలిసి సినిమా చేస్తారా అని అడిగితే, నాకూ చేయాలనే ఉంది. కానీ దానికి నాకు చాలా టైమ్ కావాలి. ఇప్పుడప్పుడే అన్నతో కలిసి సినిమా చేయలేను. ఓ పది సినిమాలు పూర్తయితే తప్ప అన్నతో కలిసి తెర పంచుకోలేను అని చెప్పాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన మిడిల్ క్లాస్ చిత్రాన్ని వినోద్ అనంతోజు డైరెక్ట్ చేసాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news