ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ..!

-

కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ సినిమా వచ్చేసింది. డెవిల్ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రావడానికి సిద్ధమైంది. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సినిమా డెవిల్ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 29న రిలీజ్ అయింది. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా కనపడ్డారు. డెవిల్ లో కళ్యాణ్ రామ్ కి జోడీగా సంయుక్త మీనన్ నటించారు అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని అంతలా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటిటిలోకి వస్తోంది.

డెవిల్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతోంది డెవిల్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అయితే ఇప్పటివరకు ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా సడన్ గా సినిమాని ఓటీటీ లో అనౌన్స్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సంక్రాంతికి థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి అయితే మొదలైపోయింది. మహేష్ బాబు గుంటూరు కారం తేజ హనుమాన్ సినిమా వెంకటేష్ సైంధవ్ సినిమా థియేటర్లలో ఆడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news