SIR Trailer : ధనుష్ ‘సార్’ ట్రైలర్ అదరిపోయిందిగా

-

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. ‘3, ర‌ఘువ‌ర‌న్ B-Tech, వీఐపీ, మారి, మారి-2, తిరు వంటి సినిమాలతో ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. టాలీవుడ్ లో తన మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఈసారి ధనుష్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. అదే డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న సార్ సినిమా.

ద్విభాష చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ‘అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్‌ క్లాస్‌ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్‌ చేసి చెబుతున్నా’ అంటున్న ధనుష్‌ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన సంయుక్త మేనన్‌ కథానాయికగా నటిస్తోంది. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ‘సార్‌’ను తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా నుంచి . ఇప్పటికే రిలీజైన ‘మాస్టారు మాస్టారు’, ‘బంజార’ పాటలకు విశేష స్పందన వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news