హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిపై వీధికుక్కల దాడి

-

రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. మనుషులపై వీధి కుక్కలు దాడి చేస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొంపల్లి మున్సిపల్ పరిధి 9వ వార్డులో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న రమ్యా కుమారి (7)పై ఐదు వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆ చిన్నారిని చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గత నెల 11 న తనుశ్రీ (5) అనే బాలికను కూడా వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆ బాలిక ఇప్పటికీ కోలుకోలేదు. అయితే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గత నెల 12వ తేదీన కొంపల్లి పురపాలక సంఘం పరిధిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికపై వీధికుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన కొంపల్లి ప్రాంతంలోని మహాలక్ష్మి రెసిడెన్సీ సమీపంలో జరిగింది. అప్పలరాజు, శ్యామల దంపతుల కుమార్తె తరుణ్‌శ్రీ(5) రెండు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటుంది. వీధికుక్క దాడిచేసి చిన్నారి రెండు చేతులు, ముఖంపై కరిచింది. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. వీధికుక్కలను నివారించడంలో పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారని, పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news