రామ్ లోని టాలెంటును బోయపాటి బయటకు తీశాడా..24 రోజులూ..!

-

ఇస్మార్ట్ హీరో ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వినయ విధేయ రామ సినిమా తర్వాత అఖండ అంటూ తన పవర్ చూపించడానికి సిద్ధమయ్యాడు బోయపాటి శ్రీను.. వినయ విధేయ రామ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఆ తర్వాత వచ్చిన అఖండ సినిమా అద్భుతమైన విజయాన్ని చవిచూసింది. దీంతో బోయపాటి శ్రీను మార్కెట్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు రామ్ పోతినేనితో బోయపాటి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ..రెడ్ సినిమాతో రామ్ కు ఎదురు దెబ్బ తగలగా.. ఇప్పుడు రామ్ కి ఒక హిట్టు తప్పకుండా కావాలి.

అందుకే బోయపాటి అఖండతో మంచి ఫామ్ లోకి వచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడా సినిమా చేస్తున్నారు. దీంతో సినిమాపై భారీగా హైప్ ఏర్పడింది. ఈ మధ్య విడుదల చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ రాగా బోయపాటి స్టైల్ లోనే డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక రామ్ అయితే కొత్త అవతారంలో కనిపించాడు. ఈ సినిమా కోసం రామ్ తన జుట్టును అలాగే శరీరాన్ని పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారడం గమనార్హం.

బోయపాటి సినిమా అంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందో అన్నది ఊహించాల్సిన అవసరం లేదు. పదులు , వందల మందిని హీరో నరకాల్సిందే.. క్లైమాక్స్ ని చాలా హెవీగా ఆయన ప్లాన్ చేస్తూ ఉంటాడు.అందుకే బోయపాటి ఇప్పుడు కూడా తన స్టైల్ లోనే క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని రామ్ ట్వీట్ చేస్తూ ఫైనల్ గా క్లైమాక్స్ పూర్తి చేసాము. 24 రోజుల పాటుగా యాక్షన్ సీక్వెన్స్ చేస్తూనే ఉన్నాము. మొత్తానికి నాలో టాలెంట్ ను బోయపాటి బయటకు తీసేసాడు అంటూ కామెంట్లు చేశారు రామ్.

Read more RELATED
Recommended to you

Latest news