Katrina Kaif: బాలీవుడ్ లో ఒక్క‌ట‌వ‌నున్న మ‌రో ప్రేమ జంట‌..! ఆ ల‌వ్ బ‌ర్డ్స్ ఎవ‌రంటే?

-

Katrina Kaif: బాలీవుడ్ లో మ‌రో ప్రేమ జంట ఒక్క‌ట‌వ‌నున్న‌దా? త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కనున్నారా? అంటే.. అవునేనే సంకేతాలే వస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నాయిక క‌త్రినా కైఫ్ త‌న ప్రియుడు విక్కీకౌశల్‌ తో ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. కొంతకాలంగా కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్ లు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వింటున్నాం. ఇప్ప‌టికే అనేక విహారా యాత్ర‌లు, పలు సినిమా వేడుకల్లో ఇద్దరూ జంటగానే సందడి చేస్తూ కనిపించారు. ప‌లుమార్లు ఈ ఇద్ద‌రూ సన్నిహితంగా కనిపించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ ప్రేమ జంటకి గ‌త ఆగ‌స్ట్ లో నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. ఈ కార్య‌క్ర‌మం కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌హ్నితుల మ‌ధ్య ర‌హ‌స్యంగా జ‌రిగిన‌ట్టు స‌మాచారం. డిసెంబర్‌లో ఏడడుగులు వేయబోతున్నార‌ట‌. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లోని ఓ పురాతన కోటలో జరగనుందంటూ బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌చారం .. హిందూ, క్రిస్టియన్ సంప్రాదాయ‌ల్లో డిసెంబరు 7 లేదా 9 ల్లో పెళ్లి వేడుక ఘ‌నంగా జరగనుందని సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనులతో వీరు బిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ జంట పెళ్లి దుస్తులను సభ్యసాచి డిజైన్‌ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటివరకూ ఈ విషయంపై కత్రినా, విక్కీ..ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. త్వ‌ర‌లోనే ఆఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ రానున్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news