కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉద్యోగాలు.. వివరాలు మీకోసం..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా వైద్య విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. తాజాగా కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం మరియు కర్నూలు జిల్లాలో దిశ సఖి వన్ స్టాప్ సెంటర్ లో పలు ఖాళీలు వున్నాయి.

jobs
jobs

ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. కర్నూలు జిల్లాలో పారామెడికల్ పర్సనల్ తో పాటు ఐటీ స్టాఫ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. ఇక ఖాళీల వివరాలలోకి వెళితే.. కృష్ణా జిల్లాలో మొత్తం 09 ఖాళీలు వున్నాయి. ఇందులో పీడియాట్రీషియన్ విభాగంలో 1, గైనకాలజిస్ట్ విభాగంలో 6 ఖాళీలు, అనెస్తేషియా విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి.

అలానే విద్యార్హత విషయానికి వస్తే.. ఎంబీబీఎస్ తో పాటు సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా/DNB చేసిన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు. MCI/స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో తప్పక రిజిస్టర్ అయి ఉండాలి. నేరుగా O/o District Medical & Health Office, Krishna, Machilipatnam కి వెళ్ళాలి. ఇంటర్వ్యూలు ఈ నెల 25 నుండి 31 వ తేదీ వరకు జరగనున్నాయి.

ఇది ఇలా ఉంటే కర్నూలు జిల్లాలో పారామెడికల్ పర్సనల్ పోస్టులు 2, ఐటీ స్టాఫ్ విభాగంలో 1 ఖాళి వుంది. వయస్సు వచ్చేసి… 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. పారా మెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్ గా /బి.యస్సీ.నర్సింగ్ /జి.యస్ .యం చేసి ఉండాలి.

అదే ఐటి పోస్టులకి అయితే కంప్యూటర్ డిప్లొమా/ ఐటీ విద్యార్హత కలిగి ఉండాలి. మరియు డేటా మేనేజ్మెంట్ నేపథ్యంలో లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దరఖాస్తులు అధికారిక వెబ్ సైట్ http://kurnool.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అప్లై చెయ్యాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news