చరణ్ ఫ్యాన్స్ కి చావు కబురు చల్లగా చెప్పనున్న రాజమౌళి….??

-

ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా కలిసి నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఇతర భాషల ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సీనియాలో టాలీవుడ్ తో పాటు మరికొందరు ముఖ్యమైన బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు.

 

ఇక ఇప్పటివరకు ఈ సినిమాలోని ఇద్దరు హీరోల అఫీషియల్ లుక్స్ బయటకు రాకపోవడంతో అటు నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు మెగా ఫ్యాన్స్ సైతం ఎంతో ఆశగా వేయి కళ్ళతో తమ తమ హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజైన మార్చి 27న ఆయన అల్లూరి లుక్ ని ఆర్ఆర్ఆర్ టీమ్ రిలీజ్ చేయనుంది అంటూ రెండు రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో, అందులో ఏ మాత్రం నిజం లేదనే వాదన నేడు కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి నేడు వినపడుతోంది.

 

ఎందుకంటే అటు చరణ్ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ లుక్, అలానే ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలనేది ఆర్ఆర్ఆర్ టీమ్ ఉద్దేశ్యం కాదని, ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ లు ఒకే రోజున రిలీజ్ చేసేలా దర్శకుడు రాజమౌళి ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఒకవేళ రామ్ చరణ్ బర్త్ డే నాడు ఆయన అల్లూరి లుక్ కనుక రిలీజ్ కాకపోతే ఇది ఒకరకంగా ఆయన ఫ్యాన్స్ కి చావు కబురే అని చెప్పకతప్పదు….!!

Read more RELATED
Recommended to you

Latest news