వాళ్ళని కాస్త పట్టించుకోండి కే‌సి‌ఆర్ జీ .. పాపం కదా !

-

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కెసిఆర్ మొట్టమొదటి ఎన్నికలలో భారీ విజయం సాధించారు. ఆ తర్వాత కూడా అదే స్థాయిలో విజయం సాధించారు. అయితే మొదటి సారి జరిగిన ఎన్నికల సందర్భంలో ఎవరితో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యమం చేసే సమయంలో తెలంగాణ సాధించడానికి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోరాడారో వారిని తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఎన్నికయ్యాక పార్టీలో చేర్చుకోవడం జరిగింది. Image result for kcr

దీంతో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన చాలా మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కెసిఆర్ వ్యవహరించిన తీరుకు చాలా బాధ పడ్డారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉద్యమం సమయంలో తుమ్మల నాగేశ్వరావు, మధుసూదనా చారి, వేణుగోపాల చారి, జూపల్లి కృష్ణారావు ఇలా కొంతమంది నాయకులతో పోరాడటం జరిగింది. అటువంటి నాయకులను కెసిఆర్ తన పార్టీలోకి చేర్చుకోవడం తో పాటు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం పట్ల తీవ్ర స్థాయిలో టిఆర్ఎస్ పార్టీలో మాటలు వినబడుతున్నాయి.

 

ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మరియు నమ్మకమైన నాయకులను కెసిఆర్ పక్కన పెట్టే వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో ముందు నుండి పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలు నాయకులు మమ్మల్ని పట్టించుకోండి అంటూ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ప్రస్తుతం లబోదిబోమంటున్నారట. దీంతో కెసిఆర్ కి కొంత సన్నిహితంగా ఉండే పార్టీలు ఓ వర్గం వారు కూడా వాళ్ళని కాస్త పట్టించుకోండి కే‌సి‌ఆర్ జీ..పాపం కదా అని అంటున్నారట.  

Read more RELATED
Recommended to you

Latest news