ప్పుడు పెద్దగా నా గురించి ఆనకపోవచ్చు. నా బొమ్మలు పోస్టర్లలో పెద్దవి వేయకపోయినా నేను పట్టించుకోను. నాకు పద్మశ్రీలు ఇచ్చారా? అన్నదీ పట్టించుకోను!!
దాదాపు నాలుగు దశాబ్ధాలు నటించాక ఇప్పుడు పోస్టర్లలో వేయాల్సిన అవసరం ఏం ఉంటుంది? అంత పెద్ద సీనియర్ ని పోస్టర్లలో ముద్రించి ఆడియెన్ కి పరిచయం చేయాల్సిన అవసరం ఏదీ ఉండదు. ఆయన ఆ సినిమాలో ఉన్నారు అన్నదే పోస్టర్ వేయడం లాంటిది. అయితే గౌరవార్థకం గా పోస్టర్ లో అతడి బొమ్మ వేయకపోతే ఎంతైనా సీనియర్ కదా! ఫీలయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఎవరి విషయంలో అంటారా?
శనివారం సాయంత్రం ‘ఓ బేబి’ ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తనలోని అసంతృప్తిని చూఛాయగా బయటపెట్టారు. “42 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను. ఫిలింఇనిస్టిట్యూట్ లో అథెంటిక్ గా చదువుకున్న ఆర్టిస్టును. ఇన్నేళ్ల తర్వాతా బిజీగా నటిస్తున్నానంటే.. నాలోని నటుడి వల్లనే. ఇదేమీ ఆషామాషీ కాదు. నాగురించి చెప్పుకుంటే ఏదోలా ఉంటుంది. అయినా నేను లేడీస్ టైలర్ తోనే ఆగిపోయేవాడినేమో.. కానీ నాలోని నటుడే ఇంత దూరం తీసుకుని వచ్చాడు” అని అన్నారు.
వేదికపై రకరకాల ఎక్స్ ప్రెషన్ ఇస్తూ.. రాజేంద్రుడు అన్న మాటలు ప్రేక్షకాభిమానుల్ని సూటిగానే తాకాయి. “ఇప్పుడు పెద్దగా నా గురించి ఆనకపోవచ్చు. నా బొమ్మలు పోస్టర్లలో పెద్దవి వేయకపోయినా నేను పట్టించుకోను. నాకు పద్మశ్రీలు ఇచ్చారా? అన్నదీ పట్టించుకోను!!” అనీ రాజేంద్రుడు కాస్త ఎమోషనల్ గానే అన్నారు. పట్టించుకోను! అంటూనే ఆయన పట్టించుకున్న సంగతి అర్థమైంది. కారణం ఏదైనా నాలుగు దశాబ్ధాల కెరీర్ లో ఎన్నో సంతృప్తికరమైన పాత్రలు చేసిన రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యపై ప్రస్తుతం పరిశ్రమలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
పోస్టర్లలో వేయకపోయినా నేను సినిమాలో ఉన్నాను అంటే అది కచ్ఛితంగా ప్రాధాన్యత ఉన్నదేనని అందరికీ అర్థమవుతుంది.. అని రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేకంగా వేదికపై గుర్తు చేశారు. మొత్తానికి పద్మశ్రీ గ్రహీత అయిన రాజేంద్ర ప్రసాద్ లో ఏదో మూల కొంత అసంతృప్తి ఉందని.. అది ఇలా బయటకు వచ్చిందని సినీమీడియాలో ముచ్చట సాగుతోంది. అయితే `ఓ బేబి` పోస్టర్లలో రాజేంద్రుడు లేరా? అని వెతికితే మెజారిటీ పోస్టర్లలో సమంత- లక్ష్మి లనే హైలైట్ చేయడం కనిపిస్తోంది. అందుకే ఆయన ఫీలయ్యారా? అని ముచ్చటించుకున్నారు. కథ ప్రకారం చూస్తే.. ఓ బేబి లేడీ ఓరియెంటెడ్ మూవీ. అందుకే పోస్టర్లలో సమంత- లక్ష్మి హైలైట్ అయ్యారు. ఇదివరకూ అనీల్ రావిపూడి `ఎఫ్ 2` పోస్టర్లలోనూ వెంకీ-వరుణ్ లతో పాటు హీరోయిన్లు ఉన్న పోస్టర్లే హైలైట్ అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్ పరిమితంగానే పోస్టర్లలో కనిపించారు.
ఇటీవల నవతరం దర్శకులు సీనియర్ల ఈగోల్ని సంతృప్తి పరిచేందుకు అంతో ఇంతో స్ట్రగుల్ అవుతున్న సంగతి వాస్తవం. పోస్టర్ వేసిన ప్రతిసారీ అందులో సీనియర్లు కనబడాలంటే కాస్తంత కష్టమే. వీలున్న ప్రతిసారీ పోస్టర్లలో రాజేంద్ర ప్రసాద్ లాంటి స్టార్లను ఎలివేట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వేళ ఈగోల కంటే వ్యక్తిగత అసంతృప్తి కంటే ఓవరాల్ గా పాత్రల ప్రాధాన్యత ను చూడాల్సి ఉంటుదేమో!! సమంత- రాజేంద్ర ప్రసాద్ -లక్ష్మి- నాగశౌర్య ప్రధాన పాత్రలు పోషించిన `ఓ బేబి` జూలై 5న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.