భారత్‌పై గెలిచిన ఇంగ్లండ్.. సెమీస్ ఆశలు సజీవమే..!

-

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెయిర్‌స్టో రెచ్చిపోయాడు. శతకం బాదాడు.

ఈ టోర్నీలో తమకు ఎదురే లేదని దూసుకుపోతున్న భారత్‌కు అడ్డుకట్ట పడింది. ఇవాళ బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులే చేయడంతో ఇంగ్లండ్ విజయం ఖాయమైపోయింది. 31 పరుగల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్ సెమీస్‌కు వెళ్లే అవకాశాలను మెరుగుపరుచుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బెయిర్‌స్టో రెచ్చిపోయాడు. శతకం బాదాడు. 109 బంతుల్లో 111 పరుగులు చేశాడు. జేసన్ రాయ్ 66, స్టోక్స్ 79 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కేవలం 306 పరుగులే చేసింది. అయితే.. భారత ఆటగాడు.. రోహిత్ శర్మ సెంచరీ చేసి జట్టు భారీ స్కోరు అందించాడు. 109 బంతుల్లో రోహిత్ 102 పరుగులు చేశాడు. అయితే.. రోహిత్ శర్మ శతకం వృథా అయిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్లంకెట్ మూడు వికెట్లు తీయగా.. వోక్స్ రెండు వికెట్లు తీశాడు.

ఇక.. పాయింట్ల లెక్క ప్రకారం చూసుకుంటే ఈరోజు గెలిచిన ఇంగ్లండ్ జట్టు 10 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. 14 పాయింట్లతో ఆస్ట్రేలియా మొదటి ప్లేస్‌లో ఉండగా.. 11 పాయింట్లతో భారత్ రెండో ప్లేస్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌత్‌ఆఫ్రికా, వెస్టిండీస్, అఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news