నమస్కారం.. నన్ను ఇరికించకండి..!

-

దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించే సినిమాగా సభకు నమస్కారం సినిమాపై రెండు మూడు రోజులుగా వార్తలు వింటున్నాం. దిల్ రాజు కాంపౌండ్ లో తయారు చేయబడిన ఆ కథను బన్ని కూడా విని ఓకే చెప్పాడని. సినిమాకు టైటిల్ గా వెరైటీగా సభకు నమస్కారం అని పెట్టబోతున్నారని టాక్ వచ్చింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాడు నిర్మాత దిల్ రాజు.

ప్రస్తుతం తమ బ్యానర్ లో నితిన్ శ్రీనివాస కళ్యాణం, మహేష్ 25వ సినిమా వస్తున్నాయి తప్ప మిగతా ఏ సినిమా కనీసం చర్చల దశల్లో కూడా లేదని తెలుస్తుంది. దిల్ రాజు క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలన్ని ఫేక్ అని తేలింది. నా పేరు సూర్య తర్వాత బన్ని విక్రం కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అయితే ఆ సినిమాపై అఫిషియల్ న్యూస్ రాలేదు.

విక్రం కథలో బన్ని కొన్ని మార్పులు సూచించాడట.. ప్రస్తుతం వారిద్దరి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయట. మరి బన్ని తర్వాత సినిమా ఏదై ఉంటుందా అని అల్లు, మెగా ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news