దిల్ రాజు మళ్లీ విజయ్ ను నంబర్ వన్ హీరో అన్నడుగా..!!

-

దిల్ రాజు స్టార్ హీరో దళపతి విజయ్, మన డైరెక్టర్ వంశీ పైడిపల్లి ని తో తమిళ్ లో వారీసు గా తెలుగు లో వారసుడుగా అత్యంత భారీ స్థాయిలో సినిమా నిర్మిస్తున్నారు.రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.హీరో విజయ్ కి వున్న రెండు రాష్ట్రాల్లో వున్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని తెలుగు తమిళ భాషల్లో సంక్రాంతికి కానుక గా జనవరి 12న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది.

అయితే సంక్రాంతికి తమిళనాడు లో అజిత్ సినిమా, తన సినిమా థియేటర్స్ లో విడుదల విషయంలో అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అని కామెంట్స్ చేసి ఫ్యాన్స్ మధ్యలో అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ విషయం మర్చి పోతున్న సమయంలో మళ్లీ తన పాతశైలిలోనే గతంలో అన్న మాటలపై తాజాగా విజయ్ నెంబర్ వన్ హీరో ఎందుకు అనే దానిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.

దిల్ రాజు మాట్లాడుతూ నేను కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశా అని ప్రస్తుతం, తమిళ స్టార్ హీరోతో తెలుగు దర్శకుడిని కలిపానని అలాగే తమిళ స్టార్ డైరెక్టర్‌తోను తెలుగు స్టార్ హీరోను కలిపి సినిమా స్టార్ట్ చేసాను. ఇదో కొత్త మార్కెట్ వ్యూహం అని పేర్కొన్నాడు.ఇదొ కొత్త ట్రెండ్ అని అన్నాడు. విజయ్ పెద్ద స్టార్ అన్న విషయాన్ని గురించి చెబుతూ ఇక విజయ్ అయితే కంటిన్యూగా థియేటర్ షేర్‌ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు.. తన సినిమా ప్లాప్ అయినా కూడా అరవై కోట్ల షేర్ వస్తుంది అని అందుకే నంబర్ వన్ హీరో అని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇక మళ్లీ ఇలాంటి వ్యాఖ్యల పై ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news