ముహుర్తం కూడా పెట్టని సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..!

-

దిల్ రాజు బ్యానర్ లో అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎఫ్-2. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ ఈ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టి టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ సినిమాల్లో టాప్ 10 లో చేరిన ఎఫ్-2కి సీక్వల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఎఫ్-2 సక్సెస్ మీట్ లోనే ఆ విషయాన్ని వెళ్లడించారు.

ఇక ఈమధ్య మీడియాతో ముచ్చటించిన దిల్ రాజు ఎఫ్-3 సినిమా గురించి మాట్లాడటం జరిగింది. ఎఫ్-3 సినిమా ఉంటుందని అయితే ఆనికి కథ ఇంకా రెడీ అవలేదని.. స్టార్ కాస్ట్ కూడా నిర్ణయించలేదని అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో ఆ సినిమాలో నటిస్తున్నాడన్న వార్తలను క ఫాం చేయలేదు దిల్ రాజు. అన్ని అనుకున్నట్టు జరిగితే 2021 సంక్రాంతికి ఎఫ్-3 రిలీజ్ ప్లాన్ చేస్తామని అన్నారు. అలాంటి సినిమాలకు పండుగ సీజనే కరెక్ట్ అంటున్నారు దిల్ రాజు. మరి ఎఫ్-2 హంగామా చూశాం అదే సినిమా సీక్వల్ గా వస్తున్న ఎఫ్-3 ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news