‘ఐకాన్’ పోస్టర్ రిలీజ్ చేసి అల్లు అర్జున్ కి షాకిచ్చిన దిల్ రాజు ..!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. అయితే గత రెండు రోజుల క్రితమే బన్ని బర్త్ డే సందర్భంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయబోతున్నమన్న అఫీషియల్ అప్‌డేట్ ని ఇచ్చారు మేకర్స్. దాంతో ఎప్పుడెప్పుడు అల్లు అర్జున్ బర్త్ డే వస్తుందా అని ఈ రెండు రోజుల నుండి ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురు చూశారు.

 

అందుకు తగ్గట్టే ఈ రోజు ఉదయం 9 గంటలకి మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు అల్లు అర్జున్ గెటప్ తో పాటు టైటిల్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఎంతో కాలంగా బన్ని ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆలాంటి పాత్రలో చూపించబోతున్నారు సుకుమార్ అన్న ఆనందం లో ఉన్నారు బన్ని ఫ్యాన్స్. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేసిన చేసినప్పటి నుంచి ప్రేక్షకులందరు సుకుమార్ రాం చరణ్ తో తెరకెక్కించి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియోట్ చేసిన రంగస్థలం సినిమాతో పోల్చుకుంటున్నారు. బన్ని కి సుకుమార్ బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడని ఫిక్సైపోయారు.

అయితే అంతలోనే దిల్ రాజు అల్లు అర్జున్ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చి స్వీట్ షాకిచ్చారు. అందరూ ఆగిపోయిందనుకున్న ‘ఐకాన్’ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి దిల్ రాజు ప్రాజెక్ట్ కన్‌ఫర్మ్ అని తేల్చేశారు. వాస్తవంగా నా పేరు సూర్య’ సినిమా తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ‘ఐకాన్’. కాని కొన్ని కారణాల వల్ల ‘ఐకాన్’ ని దిల్ రాజు పక్కన పెట్టారు. దాంతో అల్లు అర్జున్ త్రివిక్రం తో అల ‘వైకుంఠపురములో’ కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత సెట్స్ మీద ఉన్న సినిమానే సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’. ప్రస్తుతం వేణు శ్రీ శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటయింది. కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’ కి షిఫ్టవుతాడు. ఈ లోపు బన్నీ కూడా పుష్ప సినిమాని దాదాపు కంప్లీట్ చేస్తాడు.

Read more RELATED
Recommended to you

Latest news