తల్లి జ్ఞాపకాలని మరిచిపోలేని దిల్ రాజు కూతురు…

ఇటీవలే ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య గుండెపోటుతో మరణించిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విషయాన్ని నిజంగా హన్షిత ని బాగా బాధిస్తోంది. తన తల్లిని చాలా మిస్ అవుతోంది హన్షిత. తల్లికి సంబంధించిన బాల్య జ్ఞాపకాలని ఆమె షేర్ చేస్తే ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన తల్లి పుట్టిన రోజు నాడు అమ్మ నిన్ను చాలా మిస్ అవుతున్నా ఇప్పటికీ ఎప్పటికీ నీ జ్ఞాపకాల తోనే జీవిస్తున్నా…. నీతో ఎన్నో జ్ఞాపకాలు అని ఎంతో బాధపడింది.

dil raju
dil raju

నీతో నేను ఎన్నో ఫోటోలు దిగాను. నీ చిరునవ్వు దృశ్యాలు చిత్రాలు ఎన్నో…. నీ దృష్టిలో ప్రేమంటే ఎప్పటిలాగా నన్ను గట్టిగా కౌగిలించు కోవడం అని ఎమోషనల్ అయ్యింది హన్షిత. అయితే దిల్ రాజు ఒంటరిగా బాధగా ఉండడం చూసి హన్షిత ఎయిర్హోస్టెస్ తేజస్విని తో వివాహం జరిపించింది ఇప్పటికే చాలా సమయాల్లో ఆమె తండ్రికి సంతోషం చాలా ముఖ్యం తనకి అని చెప్పింది. హన్షిత తన కూతురిని తన తల్లిలా చూసుకుంటున్నారని తన తల్లి మళ్ళీ తిరిగి వచ్చిందని ఆమె ఈ హ్యాపీ నెస్ ని పంచుకుంది.