బిగ్ బాస్ లోకి “నగ్నం” బ్యూటీ..?

-

తొలి మూడు సీజన్ లతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ నాలుగవ సీజన్ కు ముస్తాబవుతోంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రియాల్టీ షో పై ప్రేక్షకులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అదరగొట్టేయగా రెండో సీజన్ లో న్యాచురల్ స్టార్ నాని మంచి మార్కులు కొట్టేశాడు. ఇక మూడవ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున దీన్ని విజయవంతం చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజ‌న్ 4 విషయానికొస్తే..

ఇప్పటి వరకు హోస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, రోజుకో పేరు హోస్ట్ రేస్ లో నిస్తుంది. అలాగే ఈ సారి హౌస్ లోకి వెళ్లబోయే వారి గురించి కూడా రోజుకో పుకారు పుట్టుకొస్తుంది. తాజాగా.. ఈసారి హౌస్ లోకి రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘నగ్నం’ చిత్రంలోని హీరోయిన్ శ్రీ రాపాక వెళ్లబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇమేను బిగ్ బాస్ నిర్వాహకులు కలిసినట్టు కూడా సమాచారం. మరి ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news