నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సమయానికి ఆక్సిజన్ అందకపోవడంతో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు కొవిడ్ బాధితులు కూడా ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్‌లు అయిపోయాయి. దీంతో కొవిడ్ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు, సాధారణ వార్డులో ఒకరు మృతి చెందారు. వైద్య సిబ్బంది నిర్లక్యం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ వారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ ఘటను సంబంధించిన విషయాలపై కలెక్టర్ నారాయణ రెడ్డి విచారిస్తున్నారు. దీనికి నిర్లక్ష్యమే కారణమైతే వారు ఎంతటివారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటాడని కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.