పోలీసులపై దిల్ రాజు సినిమా, వాళ్ళు చాలా గొప్ప…!

-

యావత్ ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న కారణంగా ప్రభుత్వం దానిని అరికట్టేందుకు దేశం మొత్తం లాక్ డౌన్ ను విధించింది. ప్రజలు ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ అనేది భాద్యతాయుతంగా తీసుకోవాలని ప్రభుత్వాలు పలువురు నేతలు సూచిస్తున్నారు. ప్రజలను రక్షించే పనిలో పోలీసులు, డాక్టర్లు, పారిశుధ్య సిబ్బంది వంటి వారు నిమగ్నమై ఉన్నారు. వారు తమ స్వలాభం, ఇంకా వారి కుటుంబాలను పక్కన పెట్టీ మరి ప్రజలను రక్షించే పనిలో పడ్డారు.

అందుకే మనందరం వీరికి చాలా రుణపడి ఉన్నాం. వీరి గొప్పతనాన్ని గుర్తించిన దర్శకుడు దిల్ రాజు ఈ పరిణామాలన్నింటిపై ఒక సినిమా తీస్తానని తెలిపారు. పోలీసుల గొప్పతనాన్ని వివరిస్తూ ఓ సినిమా తీయాలని చాలారోజుల నుంచి అనుకుంటున్నట్లు చెప్పారు. మెహిదీపట్నంలో పోలీసు సిబ్బందికి సానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు.

మనమంతా ఇళ్లలో క్షేమంగా ఉంటే పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది మనందరి కోసం సేవలు చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని సినీ నిర్మాత దిల్‌రాజు వారిని కొనియాడారు

Read more RELATED
Recommended to you

Latest news