రాజ‌మౌళి లాంటి ప్లాన్ చేస్తున్న డైరెక్ట‌ర్ కొర‌టాల‌.. ఆ ఇద్ద‌రి మ‌ధ్య అదిరిపోయే యాక్షన్?

-

తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ వెయిటెడ్ సినిమాగా తెర‌కెక్కుతోంది ఆచార్య‌. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయ‌న కొడుకు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. సిద్ధ అనే ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌గా ఆయ‌న‌కు జోడీ పూజా హెగ్ధే న‌టిస్తోంది. ఇక మెగాస్టార్‌కు తోడుగా కాజ‌ల్ మెరుస్తోంది.

రాజ‌మౌళి/Rajamouli
రాజ‌మౌళి/Rajamouli

అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ రోల్ అత్యంత కీలకంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని, ఆయ‌న రోల్ ఏకంగా సినిమాను మ‌లుపు తిప్పుతుంద‌ని ఇదివ‌ర‌కే బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొరటాల శివ వెల్ల‌డించారు. కాగా ఆయ‌న ఇప్పుడు రాజ‌మౌళిని ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

రాజ‌మౌళి ఇంత‌కుముందు బాహుబ‌లిలో ఎలాగైతే ప్ర‌భాస్‌, రానాల మ‌ధ్య గూస్ బంప్స్ ఫైట్ క్రియేట్ చేశాడో ఇప్పుడు కొర‌టాల కూడా అలాంటి ఫైట్ సీన్ పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇదే నేప‌థ్యంలో ఇప్పుడు బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ తో పాటు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ మ‌ధ్య గూస్ బంప్స్ వ‌చ్చే ఫైట్ సీన్‌ను పెడుతున్నాడు కొరటాల శివ. దీంతో ఫ్యాన్ష్ తెగ కుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news