మెగా కాంబినేషన్: శంకర్ డైరెక్షన్‌లో చిరంజీవి

61

150వ సినిమాతో రీ ఎంట్రీ మెగాస్టార్‌ చిరంజీవి మంచి ఊపుమీదున్నాడు. ప్రస్తుతం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. మెగాస్టార్‌ కొత్త చిత్రం గురించిన మెగా న్యూస్‌ ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతుంది.

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌, మెగాస్టార్‌ చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనేది ఆ వార్తల సారాంశం. అయితే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మించనున్నారట. ప్రస్తుతం శంకర్‌ కమల్‌ హాసన్‌తో భారతీయుడు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మెగాస్టార్‌ సినిమా ఉంటుందట. అయితే ఈ మెగా మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఎన్నాళ్లనుండో ఊరిస్టూ వస్తున్న ఈ కాంబినేషన్‌ కార్య రూపం దాలిస్తే మెగా అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.. చిరంజీవి కూడా పలుమారు ఆడియో ఫంక్షన్స్‌లో శంకర్‌తో చేయాలని ఉంది అని అభిప్రాయాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

మెగస్టార్‌ సైరా తరువాత నటించబోయే చిత్రాలు భారీగా ఉండనున్నాయి. సైరా చిత్రం తరువాత వరుసగా స్టార్‌ డైరెక్టర్లతో సినిమాలు చేయనున్నాడు చిరు. సైరా చిత్రం పూర్తి కాగానే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఈ సినిమాను కూడా చరణే నిర్మించనున్నాడని టాక్‌. ఆ తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నాడు. వీటి తరువాత శంకర్‌తో సినిమా.. ఇదీ చిరంజీవి నటించబోయే సినిమాల లిస్టు..