పూనం కౌర్ అసభ్యకర వీడియోలు.. సైబర్ క్రైం కు ఫిర్యాదు..!

851

పూనం కౌర్ ఈ పేరు వినగానే తెలుగు హీరోయిన్ అనేదానికన్నా పవన్ తో ఆమెకున్న రిలేషన్ ఏంటన్న చర్చే ఎక్కువ జరుగుతుంది. కత్తి మహేష్ పవన్ ను టార్గెట్ చేస్తూ పూనం కౌర్ గురించి క్లూస్ ఇచ్చేశాడు. అయితే మొదట్లో పూనం పవన్ కు సపోర్ట్ గా మాట్లాడగా ఆ తర్వాత కొద్దిగా రివర్స్ అవుతూ వచ్చింది. ఇక ఈమధ్య పవన్ కళ్యాణ్ పై పూనం కౌర్ ఆడియో టేపుల హంగామా తెలిసిందే.

అందులో ఉన్నది పూనం వాయిసా కాదా అన్నది కన్ఫర్మేషన్ లేదు కాని పూనం బయట పెట్టిన పవన్ నిజ స్వరూపం అంటూ మీడియా నానా రచ్చ చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా తన గురించి అసభ్యకరమైన పోస్టులు, వీడియోలు ఎక్కువయ్యాయి.. వీటితో తనని మానసికంగా వేధిస్తున్నారని పూనం కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

తనపై కావాలని ఉద్దేశపూర్వకంగా కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూనం ఏకంగా ఏభై యూట్యూబ్ చానల్స్‌ ను ఉంచారు. అంతేకాదు తనకు అనుమానం ఉన్న వారి మీద కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని పోలీసులను ఆశ్రయించానని తెలిపింది పూనం. పోలీసులు నిందితుల్ని పట్టుకుని శిక్షించాలని పూనం కౌర్ కోరారు.