గూట్లోకి చేరుకున్న పవన్ బాబు

53

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగియడంతో ఇంటికి చేరుకున్నారు. ఆంధ్రారాష్ట్రంలో అధికారం కోసం ఆంధ్ర ప్రజల మనసులు గెలవడం కోసం తెలంగాణాని తక్కువ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఫైనల్ గా మళ్లీ తెలంగాణా ఇంటికి అదే హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. అదేంటి గాజువాకలో ఒక ఇల్లు.. విజయవాడలో ఒక ఇల్లు ఉంది కదా వచ్చి వచ్చి తెలంగాణాలో ఎందుకు ఉండటం అని అనొచ్చు.

అదంతా ప్రచారం వరకే.. తెలంగాణాలో ఆంధ్రావారికి అన్యాయమంటూ పవన్ లేవనెత్తిన పాయింట్ హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ ను చాలా ఇబ్బంది పెట్టింది. ఆ ఊపు చూసి పవన్ ఇక హైదరాబాద్ వైపు తిరిగొంగి చూడడని అనుకున్నారు కాని ఎలక్షన్స్ పూర్తవడమే ఆలస్యం సైలెంట్ గా వచ్చి ఇంట్లోకి దూరాడు. మరి మాట్లాడేప్పుడు తెలంగాణా ప్రజల మీద కామెంట్ చేసిన పవన్ కు ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ రావాల్సి వచ్చిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. పవన్ కూడా రాజకీయం నేర్చుకున్నాడని తెలంగాణా ప్రజలను అంటే ఆంధ్రా వారికి దగ్గరవుతాడని అనుకున్నాడేమో కాని అతను ఎక్కడ ఏం పని చేస్తున్నా ఏపి క్యాపి టల్ మొత్తం పూర్తయ్యే దాకా హైదరాబాద్ లోనే ఉండాలన్న విషయం మర్చిపోకూడదు.