సింపుల్ గా జరిగిన సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం ..త్వరలో పెళ్ళి డేట్ ఫిక్స్ ..!

-

తెలుగు చిత్ర పరిశ్రమకి ‘రన్ రాజా రన్’ సినిమాతో పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్. ఈ సినిమా యువి క్రియోషన్స్ లో నిర్మించారు. ఆ సమయంలోనే ఈ యంగ్ డైరెక్టర్ డార్లింగ్ ప్రభాస్ ని ఆకట్టుకున్నాడు. దాంతో పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్ తో ‘సాహో’ ని తెరకెక్కించే ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాతో సుజీత్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ బాలీవుడ్ మేకర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు.

 

ప్రస్తుతం సుజీత్ మెగాస్టార్ చిరంజీవి నటించబోయో మళయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ ని తెరకెక్కించే అద్భుతమైన అవకాశాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు అలాగే తెలుగు నేటివిటీ కి తగ్గట్టు స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేలా సన్నాహాలో ఉన్నాడు. ఒకవైపు మెగాస్టార్ సినిమాకి సిద్దమవుతూనే మరో వైపు పెళ్ళికి కూడా సిద్ధం అయ్యాడు.

 

ఈ నేపథ్యంలో సుజీత్ గత కొంతకాలంగా ప్రవల్లిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలోనే జూన్ 10న సుజీత్ నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో సుజీత్ ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. అలాగే పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. సుజీత్ చేసుకోబోయే అమ్మాయి ప్రవల్లిక వృత్తిరీత్యా డెంటిస్ట్ అని తెలుస్తోంది. త్వరలోనే పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకొని అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు..సన్నిహితుల సమక్షంలో పెళ్ళి జరగబోతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news