డైరెక్టర్ తేజ కామెంట్స్ ఇద్దరు సీనియర్ స్టార్స్ ని ఉద్దేశించేనా …?

-

టాలీవుడ్ లో ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తుల్లో దర్శకుడు తేజ ఒకరు. ఎవరి గురించి మాట్లాడాలన్న ఏమాత్రం సందేహించకుండా కుండ బద్దలు కొట్టేస్తాడు. తేజ లో ఉన్న ముక్కు సూటితనమే కొన్ని సార్లు ఇబ్బందులకు గురి చేస్తే కొన్ని సందర్భాలలో మాత్రం ఆయన మాట్లాడింది నూటికి నూరుపాళ్ళు నిజం అని సపోర్ట్ చేసే ఇండస్ట్రీ వాళ్ళు వెనక ఉన్నారు. ఇక మరోసారి తేజ ఇలాంటి సంచనలనాత్మకమైన వ్యాఖ్యలు చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ ల మద్య జరుగుతున్న కోల్డ్ వార్ ని ఉద్దేశించి దర్శకుడు తేజ స్పదించారు. ఎవరున్నా లేకపోయినా ఇక్కడ ఇండస్ట్రీ పర్మినెంట్.. మధ్యలో కొంతమంది వచ్చి ఇండస్ట్రీ నా వల్లే నడుస్తుందని అనుకుంటారు.

 

కానీ ఇండస్ట్రీ శాశ్వతం.. నాలాంటి వాళ్ళు ఎందరో వచ్చిపోతుంటారు.. రామారావు గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది.. సావిత్రి గారు పోయినా ఇండస్ట్రీ నడిచింది.. గొప్ప డైరక్టర్లు ఎంఎస్ రెడ్డి, హెచ్ ఎమ్ రెడ్డి బాపు లాంటి గొప్ప దర్శకులు లేకపోయినా చిత్ర పరిశ్రమ ముందుకు సాగుతోంది. రాఘవేంద్రరావు, కే విశ్వనాథ్ లాంటి గొప్ప దర్శకులు మనకు ఉన్నారు. ఇలాంటి వాళ్లకు గొప్ప హోదా ఉంది. ఇండస్ట్రీ తరఫున ఎలాంటి చర్చలు జరిగినా పెద్ద వాళ్లందరినీ తప్పకుండా పిలవాల్సిన అవసరం ఉందని తేజ పేర్కొన్నారు.

వాళ్ళే కాదు పరిశ్రమకు ఎవరైతే పిల్లర్ల లాగా ఉంటారో వారినందరినీ పిలవాలని.. ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యామిలీ.. ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదని.. ఎవ్వరూ తక్కువ కాదు ఎవ్వరూ ఎక్కువ కాదు అంటూ తేజ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే దాసరి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ఆయన సింహం లాంటి వాడు. ఇలాంటి పరిస్థితుల్లో దాసరి ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేవి అంటూ తన మనసులోని అభిప్రాయాలని బద్దలు కొట్టేశారు. అయితే తేజ ఈ వ్యాఖ్యలు చేసింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ లని ఉద్దేశించే అని అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో వీరిద్దరి మద్యే కోల్డ్ వార్ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news