పీకే ఫ్యాన్స్ ని మళ్లీ గిల్లిన వర్మ… “ఇష్టం లేని యుద్ధం” స్టార్ట్!

-

సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “పవర్ స్టార్”‌ పేరుతో ఓ సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి “గ‌డ్డి తింటావా?” అనే పాటను వర్మ విడుదల చేశారు. ఆ పాట నెట్ నే షేక్ చేస్తుంది! అయితే ఈ పాటపై పవన్ కల్యాణ్‌ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

అందులో భాగంగా యూట్యూబ్‌ లో ఈ పాటకు “డిస్ ‌లైక్” ‌లు కొడుతూ.. వర్మను విమర్శిస్తూ కామెంట్లు గుప్పించేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. అయితే ఈ విషయంపై ఆర్జీవీ ఏమాత్రం తగ్గకుండా తనదైన శైలిలో ధీటుగా బదులిస్తున్నారు. “పవర్ స్టార్‌ సాంగ్ ‌కు 5 గంటల్లో 5 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ.. కేవలం 20 వేల డిస్ ‌లైక్ ‌లు మాత్రమే వచ్చాయి. దీంతో ఒక పీకే ఫ్యాన్ ‌గా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే కేవలం 20వేల డిస్ ‌లైక్ ‌లు మాత్రమే వచ్చాయి. పీకేకు ఇంత తక్కువ ఫ్యాన్స్‌ ఉన్నారా?” అని ఆయన ట్వీట్ల వర్షం కురిపించారు.

కాగా పవర్ స్టార్ ‌ను రక్షించడానికి తాను రెడీగా ఉన్నానంటూ కొడవలి చేత్తో పట్టుకొని, లుంగీ కట్టుకొని ఉన్న తన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. “హేయ్ పీకే ఫ్యాన్స్.. మీరు మరింత చురుకుగా ఉండాలి.. మరిన్ని డిస్‌ లైక్స్‌ కొట్టాలి. యే హమారా ఇజ్జత్‌ కా సవాల్‌ హై” అంటూ ఆయన తనదైన శైలిలో మాటల తూటాలను పేల్చారు. అలాగే… ఈ నెల 22న విడుదల కానున్న పవర్ స్టార్ సినిమా ట్రైలర్ ‌ను చాలా మంది కొనుక్కుని చూడనున్నారని వర్మ స్పష్టం చేశారు.

అలాగే.. రాజమౌళి ఆర్‌.ఆర్‌.ఆర్.‌ సినిమా ట్రైలర్‌ ను రూ.150 లేక రూ.200కు అమ్మితే ట్రైలర్‌ కే నిర్మాతలకు మొత్తం డబ్బులు తిరిగి వచ్చేస్తాయని.. ఇక సినిమాను ఉచితంగా విడుదల చేయచ్చని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ.. పవర్ స్టార్ సినిమా నుంచి రిలీజ్ చేసిన గడ్డితింటావా? తౌడు తింటావా? పాటలో అంతరార్థాన్ని బట్టి చూస్తే… అంతా గత ఎన్నికల్లో పీకే అనే వ్యక్తికి వివిధ పార్టీల వ్యక్తులు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ఉంటుంది! ఏది ఏమైనా ఓ విషయాన్ని తీసుకొన్ని దాన్ని ప్రేక్షకులకు “మెప్పించే” రీతిలో ఆ చిత్రాన్ని మలచడం అనేది ఆయన అపారమ మేధా సంపత్తికి నిదర్శనం!!

Read more RELATED
Recommended to you

Latest news