ఎన్టీఆర్ తన సోదరుడిని అలా అప్యాయంగా పిలిచేవారని మీకు తెలుసా?

-

తెలుగు వాడి ఆత్మ గౌరవ పతాక గా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో ధ్రువతారగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్..తన కుటుంబానికి కూడా ప్రాధాన్యతనిచ్చేవారు. అయితే, ఎన్టీఆర్ కు అంటూ కొన్ని సెంటిమెంట్లు కూడా ఉన్నాయి. వాటిని ఆయన కంపల్సరీగా ఫాలో అయ్యే వారు.

తన సినిమా టైటిల్స్ తో పాటు హీరోయిన్స్ సెలక్షన్స్ , ఇతర విషయాలన్నిటినీ ఆయనే చూసుకునే వారు. ఇక ఎన్టీఆర్ ను ప్రజలు వెండితెర మీద కనిపించే నటుడిగానే కాక దేవుడిగా పూజించే వారు. ఇక రాజకీయాల్లోకి వచ్చి నాయకుడిగా ఆయన ప్రజలకు ఎనలేని సేవలు చేశారు.

సీనియర్ ఎన్టీఆర్..ఉదయాన్నే బ్రహ్మ ముహుర్తంలో మేల్కొని తన పనులను చూసుకునే వారు. ఇకపోతే తన సినిమాలను దేవుడికి పూజ చేయడం ద్వారానే స్టార్ట్ చేసేవారు. ఇక తన ప్రతీ సినిమాకు తన సోదరుడు అయిన త్రివిక్రమరావు చేతనే కొబ్బరి కాయ కొట్టించే వారు. ఇది ఆయనకు సెంటిమెంట్.

తన సోదరుడిని ఆయన పేరు పెట్టి కాకుండా ‘గోల్డ్ బ్రదర్’ అంటూ సంబోధించడాన్ని బట్టి ఆయనకు తన తమ్ముడు అంటే ఎంతటి అనుబంధమో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎన్టీఆర్ సినిమా వ్యవహారాలన్నిటినీ కూడా త్రివిక్రమరావు..దగ్గరుండి మరీ చూసుకునేవారు. త్రివిక్రమ రావు ఎన్టీఆర్ నేషనల్ ఆర్ట్స్ సంస్థ లో ఎన్టీఆర్ ఎన్నో సూపర్ హిట్ ఫిల్మ్స్ చేశారు. అలా అన్న ఎన్టీఆర్ కు తన తమ్ముడు త్రివిక్రమరావు అంటే ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news