మహేశ్-తివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ ఫిల్మ్ ఎందుకు ఆగిపోయిందంటే?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో మూవీ SSMB28 షూటింగ్ త్వరలో షురూ కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కాగా, ఈ కాంబో ఫిల్మ్ ..అనగా హ్యాట్రిక్ సినిమా అప్పట్లోనే రావాల్సిందట. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ఈ కాంబినేషన్ లో మూవీ తీయాలని టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు భావించారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా ఎంఎస్ రాజు స్టార్ట్ చేశారు. ‘సైన్యం’ అనే టైటిల్ తో సినిమా తీయాలనుకున్నారని , కానీ, అది ఎందుకో ఆగిపోయిందని ఎంఎస్ రాజు తనయుడు హీరో సుమంత్ అశ్విన్ చెప్పాడు. కాగా, అప్పుడు అనుకున్న స్టోరితోనే త్రివిక్రమ్…మళ్లీ మహేశ్ తో మూవీ చేస్తున్నారా? అని నెటిజన్లు, సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.

SSMB28 ఫిల్మ్ ను..సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన కథనాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news