అనంతబాబు అండతో విక్టర్ బాబు అరాచకాలు : నారాలోకేశ్‌

ఏపీలో టీడీపీ వర్సెస్‌ వైసీపీ నేతల మధ్య ఎప్పడూ విమర్శలు జరుగుతునే ఉన్నాయి. అయితే.. అధికార వైసీపీ పార్టీ నేతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. వారికి చెందిన విషయాలు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం చెట్లవాడ గ్రామానికి చెందిన వైసీపీ నేత విక్టర్ బాబు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గిరిజనుల నుంచి లక్షలు వసూలు చేశాడని నారా లోకేశ్ ఆరోపించారు.

Vijayawada: Take up GST hike with Centre, State urged

విక్టర్ బాబు… అనంతబాబుకే బాబులా తయారయ్యాడని విమర్శించారు. అనంతబాబు అండతో ఏజెన్సీ ప్రాంతాల్లో విక్టర్ బాబు అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు నారా లోకేశ్. గిరిజనులు అప్పులు చేసి ఇచ్చిన సొమ్ముతో విక్టర్ బాబు విలాసాలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేశ్. వైసీపీ నేత విక్టర్ బాబు దోపిడీపై దర్యాప్తు చేయాలని, గిరిజనులకు న్యాయం చేయాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.