సీమంతం వేడుకల్లో ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

-

టాలీవుడ్ లో మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే మెగా కుటుంబం ఆమెకు సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సన్నిహితులు, స్నేహితులు సమక్షంలో ఘనంగా నిర్వహించిన సీమంతం ఫోటోలు వైరల్ గా మారాయి. రామ్ చరణ్, ఉపాసన స్నేహితులు సరన్ కట్టా, స్మితారెడ్డి త్వరలో కాబోయే మమ్మీకి ఇంటిమేట్ బేబీ షవర్ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, కనికా కపూర్ , సానియా మీర్జాతో పాటు ఇతర సన్నిహితులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ఈ వేడుకల్లో ఉపాసన తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ గులాబీ రంగు గౌన్లో చాలా అందంగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ధరించిన ఆ పింక్ గౌను ఇప్పుడు మరింత వైరల్ గా మారింది పింక్ పాటర్న్ డ్రెస్ లో అందంగా ముస్తాబైన ఈమె డీప్ వీ నెక్ తో .. షార్ట్ స్లీవ్ లో వున్న ఈ డ్రెస్ నీడిల్ థ్రెడ్ బ్రాండ్ కు చెందింది. దీని ధర అక్షరాల 1102 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.90,471.. ఏప్రిల్ 19 2023న త్వరలోనే తల్లి కాబోతున్న ఉపాసన కామినేనికి రామ్ చరణ్ కుటుంబం ఘనంగా శ్రీమంతం జరిపించారు. అందులో ఆమె ప్లేటెడ్ ఆఫ్ స్లీవ్ ట్యూనిక్ బాడీ ఫిట్ డ్రెస్ ను ధరించింది దాని విలువ రూ.35,352.

మరొకవైపు మొదటి మూడు నెలల్లో జరిగిన బేబీ షవర్ కోసం ఆమె ఒక తెల్లటి రంగు పూల డ్రెస్ లో తన బేబీ బంపును ప్రదర్శిస్తూ కనిపించారు. ఈ డ్రెస్ బ్రాండ్ జిమ్మర్ మ్యాన్ కు చెందింది.. దీని ధర సుమారుగా రూ.1,11,651.. ఏది ఏమైనా ఉపాసన ధరించిన ఈ దుస్తుల విలువ ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news