నందమూరి కుటుంబానికి సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ ఉంది. నందమూరి తారక రామారావు ఇండస్ట్రీలో హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాదు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేశారు. ఇకపోతే ఆయన వారసులిగా ఇండస్ట్రీలోకి చాలామంది అడుగు పెట్టారు. ఇలా నందమూరి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా బీటెక్ చదువుతున్న రోజుల్లోనే సినిమాల్లోకి అడుగు పెట్టారు తారకరత్న.
మొదటి సినిమాతోనే పర్వాలేదు అనిపించుకున్న తారకరత్న అనంతరం ఒకే రోజున 9 సినిమాలకు సైన్ చేసి సంచలనం సృష్టించారు. ఇలా ఇండస్ట్రీలో ఒకేరోజు 9 సినిమాలకు కమిట్ అయిన హీరోగా తారకరత్న రికార్డు సృష్టించారు. అయితే ఇప్పటివరకు ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. అయితే ఇందులో కొన్ని సినిమాలు షూటింగ్ పనులు మొదలుపెట్టాక ఆగిపోతే మరికొన్ని షూటింగ్ మొదలు పెట్టకుండానే ఆగిపోయాయి. హీరోగా తారకరత్నకు ఇండస్ట్రీలో కలిసి రాలేదు. ఇండస్ట్రీకి కొద్దిరోజుల పాటు దూరమైన ఈయన ఆ తర్వాత అమరావతి చిత్రంతో విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఆ పాత్రకు గాను నంది అవార్డు కూడా లభించింది.
ఇటీవల గుండెపోటుతో మరణించగా.. నిన్న దశదినకర్మ కూడా పూర్తయింది. ఈ క్రమంలోని ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఆయన మొదటి పారితోషకం ఎంత తీసుకున్నారో విషయానికి వస్తే శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా తారకరత్న ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. అప్పట్లో ఈయన ఈ సినిమా బడ్జెట్ లెక్కవేసి కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాలని అనుకున్నాము. అందుకే తారకరత్న రెమ్యునరేషన్ తగ్గించాలని భావించినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. దీంతో అన్ని ఖర్చులకు కలిపి తారకరత్నకు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చినట్లు ఒక ఇంటర్వ్యూలో అశ్విని దత్ వెల్లడించారు.