Srikanth : గోపీచంద్, శ్రీకాంత్ మధ్య ఉన్న బంధుత్వమిదే..

-

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్..ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపున విలన్‌గానూ నటిస్తున్నారు. శ్రీకాంత్ పలు చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నారు. నందమూరి నటసింహం ‘అఖండ’ పిక్చర్ లో శ్రీకాంత్ విలన్ రోల్ ప్లే చేయగా, ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. శ్రీకాంత్ ప్రజెంట్ ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబో లో తెరకెక్కుతున్న ‘ఆర్ సీ 15’ ఫిల్మ్ లో కీ రోల్ ప్లే చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీకాంత్.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వందకు పైగా సినిమాలు చేసిన ఈ సీనియర్ హీరో తన తనయుడు రోషన్ ను హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సంగతులు పక్కనబెడితే శ్రీకాంత్, మ్యాచో మ్యాన్ గోపీచంద్ కు మధ్య బంధుత్వం ఉందండోయ్. అయితే, ఈ విషయం చాలా మందికి తెలియదు.

శ్రీకాంత్ ‌కు ఒక అక్క , ఒక తమ్ముడు ఉన్నారు. కాగా, శ్రీకాంత్ కోడలు అనగా వాళ్ల అక్క కూతురును గోపీచంద్ మ్యారేజ్ చేసుకున్నారు. అలా శ్రీకాంత్‌కు గోపీచంద్ కు బంధుత్వం పరంగా వరసకు కొడుకు అవుతారు. మరో విధంగా చెప్పాలంటే.. గోపీచంద్ భార్య శ్రీకాంత్ మేనకోడలు. గోపీచంద్ నటిస్తున్న చిత్రాలు కొన్నాళ్లుగా అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి – గోపీచంద్ కాంబోలో వస్తున్న ‘పక్కా కమర్షియల్’ ఫిల్మ్ ఈ ఏడాది జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమాపైన హోప్స్ చాలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news