ఎన్టీఆర్​ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్యకు రిలేషన్​.. ఏంటో తెలుసా?

-

నాగశౌర్య త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అయితే నాగశౌర్య కాబోయే భార్య కర్ణాటకకు చెందిన అనూష శెట్టిగా ప్రకటించారు. బెంగళూరుకు చెందిన ఈ ఇంటీరియర్​ డిజైనర్​తో ప్రేమలో పడ్డ యంగ్​ హీరో తన కలల రాకుమారిని.. ఈ నెల 20న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నారు. అయితే ఈ అమ్మాయికి యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ తల్లికి ఓ దగ్గరి సంబంధం ఉంది.

- Advertisement -

ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందిన మహిళ. మంగుళూరుకు సమీపంలోని కుందాపూర్ ఆమె స్వస్థలం. మన ‘కాంతార’ స్టార్​ రిషబ్​ కూడా ఈ ఊరికి చెందిన వారే. అయితే ఇప్పుడు నాగశౌర్యకు కాబోయే భార్య అనూష శెట్టిది కూడా అదే ఊరట. అలా వారందరూ ఒకే ఊరికి సంబంధించిన వాళ్లు అవ్వడం విశేషం. అంతే కాకుండా నాగశౌర్యకు ఇష్టమైన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఇక నాగశౌర్య అంటే ఎన్టీఆర్ సతీమణి ప్రణతికి ఎంతో ఇష్టమట.. ఎంతంటే ఆయన సినిమాలోని ఓ పాటను ఆమె రింగ్ టోన్‌గా పెట్టుకునేంతగా.

ఎవరీ అనూష ? ఆమె బెంగళురులోని ఓ ఇంటీరియర్ డిజైనర్. పలు ప్రముఖ కంపెనీలకు సేవలు అందించిన అనూష.. ‘బెస్ట్​ ఆర్కిటెక్‌గా’ స్టేట్ అవార్డును సైతం అందుకున్నారు.’అనూష శెట్టి డిజైన్స్’ పేరుతో ఓ కంపెనీ ప్రారంభించిన ఆమె… పలు అవార్డులు గెలుచుకున్నారు. ఈ క్రమంలో బెంగళూరులోనే ఆమెకు నాగశౌర్యకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి ఇప్పుడు పెద్దల సమక్షంలో ఒకటయ్యే వరకు వచ్చింది.

అప్పుడే చెప్పేశారు.. ‘కృష్ణ వ్రింద విహారి’తో ఈ ఏడాది సెప్టెంబర్ 23న నాగశౌర్య థియేటర్లలోకి వచ్చారు. విశేషం ఏమిటంటే… పెళ్లి నేపథ్యంలో ఆ సినిమా రూపొందిందిన ఆ సినిమా విడుదల సమయంలో నాగశౌర్య పెళ్లి ప్రస్తావన రాగా.. ఆయన తల్లి ఇలా అన్నారు. ”ఈ తరం యువతకు పెళ్లి విషయంలో స్పష్టత ఉంది. అబ్బాయి పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. అయినా ఈ కాలం పిల్లల మాట వింటారా?” అని అన్నారు. తమ కుమారుడికి ప్రేమ వివాహమని అప్పట్లో ఆమె హింట్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...