గాలోడు సినిమాకి సుధీర్ అందుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బుల్లితెరపై ప్రకారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ ప్రస్తుతం ఫిలిం స్టార్ అయిపోయాడు. తాజాగా ఈయన నటించిన చిత్రం గాలోడు.. నేడు థియేటర్స్ లో విడుదలైన నేపథ్యంలో.. ఈ సినిమా కోసం సుదీర్ ఎంత పారితోషకం తీసుకున్నాడు అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలోకి రాకముందు సుధీర్ ఎన్ని కష్టాలు పడ్డాడో మనందరికీ తెలిసిందే.. తినడానికి తిండి.. ఉండడానికి నీడ..కనీసం తాగడానికి నీరు కూడా లేని పరిస్థితుల నుండి నేడు రోజుకు లక్షల సంపాదించే స్థాయికి చేరుకున్నాడు.

ఒక మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్ అడపాదడపా షోస్ చేస్తూ చాలీచాలని జీతంతో కాలం వెళ్ళదీస్తూ ఉండేవాడు. కానీ జబర్దస్త్ లోకి వెళ్లిన తర్వాత తన ఫేట్ మారిపోయిందని చెప్పాలి. 2013లో వెండితెర కమెడియన్ షకలక శంకర్, ధనరాజ్, టిల్లు వేణు, చమ్మక్ చంద్ర, రాఘవ , రఘు టీం లీడర్స్ తో జబర్దస్త్ ప్రారంభమైంది. మొదట వారి టీంలో సభ్యుడిగా చేరిన సుధీర్ ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత గెటప్ శ్రీను, రాంప్రసాద్ వంటి టీం సభ్యులు దొరకడంతో సుధీర్ కి బాగా కలిసి వచ్చింది. అలా సుమారుగా కొన్ని వందల ఎపిసోడ్లు వీరి ముగ్గురు కలయికలో వచ్చి మరింత గుర్తింపు తీసుకురావడం జరిగింది.

మరొకవైపు ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు మూడవసారి ముచ్చటగా గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుధీర్. రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో గెహణ సిప్పీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఈరోజు విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు సుదీర్ పారితోషకం ఎంత అంటే రూ.60 లక్షలు తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.