నందమూరి తారక రామారావు.. రెండు తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు.. సినిమాలలోనే కాకుండా రాజకీయంగా కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. సాంఘిక , పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించిన ఈయన ఆ తర్వాత నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయ పరంగా కూడా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక పోతే ఆయన సినీ కెరీర్లో మొత్తం 295 సినిమాలలో నటించగా.. అందులో 278 సినిమాలు అత్యధిక విజయం సాధించడం గమనార్హం. ఇకపోతే ఈ మొత్తం సినిమాల కలెక్షన్ ఎంత రాబట్టింది అనే విషయం ఇప్పుడు ఒకసారి అడిగి తెలుసుకుందాం.
మొదటిసారి ఎన్టీఆర్ నటించి విడుదలైన తొలి చిత్రం మన దేశం.. ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్ర పోషించిన ఈయన ప్రేక్షకులను అద్భుతంగా మెప్పించారు.
ఇక సీనియర్ ఎన్టీఆర్ మొదటిసారి హీరోగా నటించిన మొదటి చిత్రం పల్లెటూరి పిల్ల. బి.ఎ.సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకుంది. కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్లో తెరకెక్కిన గుండమ్మ కథ సినిమా ఎన్టీఆర్ 100 వ చిత్రం కావడం గమనార్హం. ఇక యోగానంద డైరెక్షన్లో కోడలు దిద్దిన కాపురం.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 200 సినిమా కావడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ చివరిగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించగా ఇక ఈ సినిమా రిలీజ్ అయి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు
తాజాగా అందుతున్న అంచనాల ప్రకారం సీనియర్ ఎన్టీఆర్ నటించిన మొత్తం సినిమాలు కలెక్షన్ రూ.250 కోట్ల రూపాయల వరకు రావడం గమనార్హం. ఇప్పటి టికెట్ ధర ల ప్రకారం చూసుకుంటే మొత్తంగా రూ.10 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఆయన నటించిన సినిమా కలెక్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఇక 1964వ సంవత్సరంలో ఎన్టీఆర్ ఏకంగా పదహారు సినిమాలలో నటించి విడుదల చేశారు.