షూటింగ్ కంప్లీట్..‘‘ది వారియర్’’గా రామ్ పోతినేని వచ్చేస్తున్నాడు..

-

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని వెండితెరపైన లైవ్ వైర్‌లా కనిపిస్తుంటాడని సినీ అభిమానులు చెప్తుంటారు. తెలుగు ప్రేక్షకులకు చివరగా ఆయన ‘‘రెడ్’’ చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘‘ ది వారియర్’’ పైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ లింగు స్వామి తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా, శ్రీనివాసా చిట్టూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్ జూలై 14న విడుదల కానుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి తెలిపారు. తమ సంస్థలో తెరకెక్కిన ఈ ఫిల్మ్.. డెఫినెట్ గా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఉప్పెన’’ ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ పిక్చర్ లో రామ్ పోతినేని ‘‘సత్య’’ అనే పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ‘‘బుల్లెట్’’ సాంగ్ కు చక్కటి స్పందన లభిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఆలపించిన ఈ సాంగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇటీవల హీరో ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ చేశామని, దాంతో షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిపారు ప్రొడ్యూసర్ శ్రీనివాసా చిట్టూరి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని మేకర్స్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news