కమెడియన్ ఆలీ లవ్ స్టోరీ బ్రేకప్ గురించి ఈ విషయాలు తెలుసా..?

-

మొదట చైల్డ్ యాక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ఆలీ ఎన్నో చిత్రాలలో హీరోగా కమెడియన్ గా నటించారు. ఇప్పటికీ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యనే రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చి పదవి కూడా పొందారు. తన సినీ కెరియర్లో ఎన్నో సక్సెస్ సినిమాలలో నటించిన ఆలీ ఎన్నో సంవత్సరాలుగా ఆలీతో సరదాగా అనే షోలో హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు తాజాగా ఇందులోనే గెస్ట్ గా వచ్చి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కమెడియన్ ఆలీ మాట్లాడుతూ.. తనని ఎవరు చూసినా ఆలీ మనోడే అని పిలుస్తూ ఉంటారని.. ఇది చనిపోయే వరకు ఇలానే ఉంటుందని ఆలీ తెలిపారు. తాను మంచి చేస్తే అది తన పిల్లలకు కూడా వర్తిస్తుంది అని ఆలీ తెలియజేయడం జరిగింది. తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా సీతాకోకచిలుక సినిమాకి అవార్డు అందుకున్నారని.. ఆ తర్వాత హీరోగా నటించిన యమలీల చిత్రం ఒక సంవత్సరం పాటు ఆడిందని ఆలీ తెలియజేశారు. తన కెరియర్ లో 150 పైగా సినిమాలలో తాగుబోతు పాత్రలోనే నటించానని తెలిపారు.

మన సౌత్ లో ఉండే అన్ని భాషలలో కూడా తాను మాట్లాడగలనని.. ఇతరులు మాట్లాడిన మాటలను అర్థం కూడా చేసుకోగలరని ఆలీ తెలిపారు. తన కామెడీ అంటే పూరి జగన్నాథ్ కు చాలా ఇష్టమని.. కమెడియన్ కావాలని సినిమాలోకి వచ్చానని తెలిపారు. అయితే ఇంటిదగ్గర ఒక అమ్మాయి ఉండేదని . ఒకరోజు ఆమె వర్షంలో తడుచుకుంటూ వెళ్లడం చూసి తన దగ్గర ఉన్న గొడుగుని ఇచ్చానని.. ఆ అమ్మాయి గొడుగును తీసుకుంది. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న విషయం తన అమ్మకు మాత్రం నచ్చలేదని.. తెలియజేశారు. అందువల్లే మా పెళ్లి రద్దయిందని తెలిపాడు ఆలీ.

Read more RELATED
Recommended to you

Latest news