బ్రో సినిమా కోసం త్రివిక్రమ్ పారితోషకం ఎంతో తెలుసా..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న రీమేక్ చిత్రం బ్రో.. ఈ సినిమాకి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఈ చిత్రానికి కథనం , మాటలు అందిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమిక్స్ సినిమాలకు త్రివిక్రమ్ అన్ని పనులను దగ్గరుండి మరి చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని త్రివిక్రమ్ ఫలానా సినిమా రీమేక్ చేయొచ్చు అని చెబితే పవన్ కళ్యాణ్ కూడా ఆ రీమేక్ చేస్తున్నాడు.. అంతలా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల మధ్య ఫ్రెండ్షిప్, అండర్స్టాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో భాగంగానే బ్రో గా రాబోతున్న ఈ సినిమా ఈనెల ఆఖరిన రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాకి కూడా డైరెక్టర్గా మాతృక దర్శకుడు సముద్రఖని కి అవకాశం ఇచ్చినా సరే ఈ సినిమాపై త్రివిక్రమ్ హ్యాండ్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఒకపక్క మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తూనే ఇంకోపక్క బ్రో సినిమా పనులను దగ్గరుండి మరి చూసుకుంటున్నాడట త్రివిక్రమ్. మరొకపక్క మహేష్ బాబు సినిమాలను పక్కనపెట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడని మహేష్ బాబు అభిమానులు కూడా త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కోసం పనిచేస్తున్న నేపథ్యంలో ఎంత పారితోషకం తీసుకుంటున్నాడు అన్నది ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ అందిస్తున్న త్రివిక్రమ్ ఏకంగా రూ.15 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. ఏదిఏమైనా బ్రో సినిమాకి పారితోషకం రూపంలోనే ఎక్కువ బడ్జెట్ అయిందని.. సినిమా ప్రొడక్షన్ కాస్త తక్కువే అయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news