సీనియర్ ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏంటో తెలుసా..?

-

స్వర్గీయ నందమూరి తారక రామారావు భోజన ప్రియులని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆయన కోసం ప్రతిరోజు ప్రత్యేకమైన వంటకాలను వండి మరి తీసుకొచ్చేవారు వారి వంట మనుషులు. అంతేకాదు తన భార్య బసవతారకం ప్రత్యేకంగా ఆయన కోసం కొన్ని రకాల వంటలను వండి మరీ పెట్టేదట. అందులో మరీ ముఖ్యంగా ఆయనకు ఇష్టమైన వెజ్ వంటకం కూడా ఉంది అని ఇటీవల ఒక వార్త బాగా వైరల్ గా మారింది. మరి నందమూరి తారకరామారావు అమితంగా ఇష్టపడే ఆ వెజ్ వంటకం ఏంటో ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం..

నిజానికి ఎన్టీఆర్ మాగాయ్ పచ్చడిని ఎంతగానో ఇష్టపడే వారట . ముఖ్యంగా నిమ్మకూరు నుంచి బసవతారకం, ఎన్టీఆర్ బంధువులు మాగాయ పచ్చడి ఆయన కోసం ప్రత్యేకంగా పంపించే వారిని సమాచారం. ఇక మాగాయ పచ్చడిని ఎన్టీఆర్ తినడంతో పాటు ఇతరులకు సైతం ఆ పచ్చడి రుచి చూపించే వారని సమాచారం. ఇక వేడివేడి అన్నంలోకి మాగాయ పచ్చడినే కూరగా , పచ్చడిగా ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా తినేవారిని ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.ఇతర విషయాలలో నైనా కాంప్రమైజ్ అవుతారేమో తెలియదు కానీ భోజనం విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదట. నచ్చిన వంటకాలను చేయించుకొని మరి తినేవారట ఎన్టీఆర్.

ఇక ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. రెండు రంగాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా సినిమాలలో అడుగు పెట్టిన మొదట్లో ఎన్నో నాటకాలలో పనిచేసిన ఈయన మద్రాస్ చేరుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయారు. ఇక సాంఘిక, జానపద, పౌరాణిక వంటి చిత్రాలలో నటించడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో కూడా ఎన్నో చిత్రాలను తెరకెక్కించారు. తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నారు .రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు. ఇక ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా కొనసాగింది.

Read more RELATED
Recommended to you

Latest news